"ఆమె" సినిమాతో సంచలన నటిగా మారిపోయిన అమలా పాల్ ప్రధాన పాత్రలో దర్శకుడు పవన్ కుమార్ 'కుడి ఎడమైతే' అనే సైంటిఫిక్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ను రూపొందిస్తున్నాడు. రాహుల్ విజయ్ మరో ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ వెబ్ సిరీస్ ఈ నెల 16వ తేదీ నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ వెబ్ సిరీస్ నుంచి ఒక టీజర్ ను రిలీజ్ చేశారు.
అమలా పాల్ ఒక పోలీస్ ఆఫీసర్ .. రాహుల్ విజయ్ ఒక డెలివరీ బాయ్. ఈ ఇద్దరూ ఎవరి పనులపై వారు వెళుతూ ఉండగా, యాక్సిడెంట్ జరుగుతుంది. ఇద్దరూ కూడా ఆ ప్రమాదంలో గాయపడతారు. అమలా పాల్ నటన ఈ వెబ్ సిరీస్ కి హైలైట్ గా నిలిచేలా అనిపిస్తోంది. ఒక ఇంట్రస్టింగ్ పాయింట్ చుట్టూ తిరిగే ఈ వెబ్ సిరీస్ ను, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మిస్తున్నారు.
'లూసియా, యు టర్న్' (తెలుగు యు టర్న్) ను తెరకెక్కించిన దర్శకుడి నుంచి వస్తున్న వెబ్ సిరీస్ కావడంతో అందరిలోను ఆసక్తి ఉంది.
[zombify_post]