కేరళ నుంచి బ్రతుకుతెరువు కోసం అబుదాబికి వెళ్ళిన ఒకతనికి లాటరీ రూపంలో అదృష్టం తలుపులు తట్టింది. దాంతో ఆయన రాత్రికిరాత్రే కోటీశ్వరుడు కాబోతున్నాడు. టాక్సీ డ్రైవర్ అయిన 37 ఏళ్ల రెంజిత్ సోమరాజన్ కొంతకాలం క్రితం కేరళ నుంచి అబుదాబి వెళ్లాడు. 2008 నుంచి అక్కడ ట్యాక్సీ నడుపుతూ జీవనం సాగిస్తున్నారు.
రెంజిత్ సోమరాజన్ మరో 9 మంది స్నేహితులతో కలిసి లాటరీ టికెట్లు కొనడం అలవాటు. ఇటీవల కాలంలో వీరంతా కలిసి 100 దిర్హమ్లు పోగుచేసి ఓ లాటరీ టికెట్ కొన్నారు. ఎప్పటిలాగే ఈ లాటరీకి కూడా ప్రైజ్ రాలేదని అనుకున్నారు. మరో లాటరీని కొనుగోలు చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ సమయంలో వీరికి జాక్ పాట్ తగిలింది. లాటరీ నిర్వాహకులు తాజాగా నిర్వహించిన డ్రాలో రెంజిత్ సోమరాజన్‌కు 3 కోట్ల దిర్హమ్లు గెలుచుకున్నట్లు తెలిపారు. ఈ మొత్తం భారత్ కరెన్సీలో రూ. 40 కోట్లు. దీంతో సోమరాజన్ ఎగిరిగంతేశారు. మిగిలిన స్నేహితులకు ఈ స్వీట్ న్యూస్ చెప్పి ఆనందం వ్యక్తం చేశారు. తాను ఇప్పటికీ ఈ విషయాన్ని నమ్మలేకపోతున్నాని చెప్పారు.
తన స్నేహితులు భారత్, పాకిస్థాన్, నేపాల్, బంగ్లాదేశ్‌కు చెందిన వాళ్లని, వచ్చే మొత్తంలో సమానంగా తీసుకుంటామని సోమరాజన్ పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం లాటరీ కొంటుంటే తనను ఎగతాళి చేసేవారని, చేసే ప్రయత్నం గట్టిగా ఉంటే ఏదో ఒక రోజు అదృష్టం వరిస్తుందని ఆయన తెలిపారు.
[zombify_post]