తమిళనాడులోని కూనూరు వద్ద కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టరులో భారత త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్, ఆయన కుటుంబసభ్యులు, ఉన్నతాధికారులు ఉన్న సంగతి తెలిసిందే. ఈ హెలికాప్టర్ లో మొత్తం 14 మంది ఉన్నట్టు తెలుస్తోంది. వీరిలో ఇప్పటి వరకు ఐదుగురు చనిపోయినట్టు సమాచారం. వీరిని దగ్గర్లో ఉన్న వెల్లింగ్టన్ లోని ఆర్మీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
వెల్లింగ్టన్ సైనిక స్థావరం నుంచి గాల్లోకి లేచిన కొద్దిసేపటికే ఈ హెలికాప్టర్ అక్కడికి దగ్గర్లోని ఓ హోటల్ వద్ద కూలిపోయింది. బిపిన్ రావత్ సతీమణి మృతి చెందినట్టు అనధికారికంగా తెలుస్తోంది. బిపిన్ రావత్ బతికే ఉన్నారని… అయితే ఆయన పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.
ఇంత వరకు ఈ ప్రమాదానికి సంబంధించి అధికారికంగా ఎలాంటి సమాచారం వెల్లడి కాలేదు. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పార్లమెంటులో ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. కాగా ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభమైందని భారత వాయుసేన తెలిపింది.
[zombify_post]