యావత్ ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న కరోనా డెల్టా వేరియంట్ కేసు చిత్తూరు జిల్లా తిరుపతిలో ఒక వ్యక్తికి సోకినట్లు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు. నేడు సీఎం జగన్ రాష్ట్రంలో కొవిడ్ పై సమీక్ష నిర్వహించగా, మంత్రి ఆళ్ల నాని ఈ అంశం వెల్లడించారు.
తిరుపతి కేసు మినహా ఏపీలో మరెక్కడా డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు లేవని ఆళ్ల నాని స్పష్టం చేశారు. ఆ వ్యక్తి నుంచి ఇతరులు ఎవరికీ కొవిడ్ వేరియంట్ సోకలేదని తెలిపారు. ఇప్పుడా వ్యక్తికి చికిత్స కూడా పూర్తయిందని, కోలుకోవడం కూడా జరిగిందని, ఎవరూ ఆందోళన చెందవద్దని పేర్కొన్నారు.
కరోనా డెల్టా వేరియంట్ జన్యు ఉత్పరివర్తనం చెంది డెల్టా ప్లస్ గా మార్పు చెందిందని నిపుణులు గుర్తించడం తెలిసిందే. ఇప్పటికే భారత్ లోని పలు రాష్ట్రాల్లో డెల్టా ప్లస్ వేరియంట్ ఉనికి వెల్లడైంది. మహారాష్ట్రలో అత్యధికంగా 21 కేసులు నమోదు కాగా, కేరళ, తమిళనాడు, మధ్యప్రదేశ్ లోనూ పలువురు దీని బారినపడ్డారు.
[zombify_post]