తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక నోటిఫికేషన్‌ విడుదల


0

ఏపీలో ఎన్నికల సందడి మళ్లీ మొదలైంది. పంచాయతీ, మున్సిపల్, ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 30 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. అలాగే ఈ నెల 31న పరిశీలిస్తారు. ఏప్రిల్ 3 వరకు ఉపసంహరణ గడువు ఉంది. ఏప్రిల్ 17న పోలింగ్ కాగా, మే 2న ఓట్ల లెక్కింపు జరగనుంది.

తిరుపతి పార్లమెంట్‌ సెగ్మెంట్‌ ఉపపోరుకు BJP మినహా ప్రధాన పార్టీలు అభ్యర్థుల్ని ప్రకటించాయి.  ఉప ఎన్నికకు వైసీపీ నుంచి ప్రముఖ వైద్యుడు డాక్టర్ గురుమూర్తి పేరును ఖరారు చేశారు. టీడీపీ నుంచి కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి బరిలోకి దిగుతున్నారు. బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిని త్వరలోనే ప్రకటించనున్నారు.

మున్సిపల్‌ ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన టీడీపీ తిరుపతి ఉప ఎన్నికలోనైనా సత్తా చాటాలని పట్టుదలగా ఉంది.

[zombify_post]

Comments

comments